మోస్ట్ స్పెషల్ పర్సన్ ఇన్ మై లైఫ్… భార్యకు బన్నీ విషెస్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరోవైపు పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ చేస్తుండడంతో ఆ క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. ఈ సినిమా నుంచి ఏ అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాల్సిందే. అయితే తాజాగా ఆయన భార్య పేరు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అల్లు స్నేహ రెడ్డి పేరును బన్నీ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. దానికో ప్రత్యేకమైన కారణం ఉంది. ఈ రోజు ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వేదికగా బన్నీ అభిమానులు స్నేహారెడ్డికి పెద్ద సంఖ్యలో పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక స్టైలిష్ స్టార్ తన భార్యకు అంతే స్టైలిష్ ఫొటోతో స్పెషల్ గా విష్ చేశారు. “నా జీవితంలో అత్యంత ప్రత్యేకమైన వ్యక్తికి చాలా సంతోషకరమైన రోజు. మీలాంటి జీవిత భాగస్వామిని పొందడం అదృష్టం. ఎప్పుడూ ఆహ్లాదకరంగా ఉండే సతీమణికి జన్మదిన శుభాకాంక్షలు” అంటూ ఇంస్టాగ్రామ్ లో భార్యతో ఉన్న అద్భుతమైన ఫోటోను షేర్ చేశారు అల్లు అర్జున్.

Read Also : ఆకట్టుకుంటున్న ‘పుష్ప’రాజ్ లవర్ శ్రీవల్లి లుక్

మరోవైపు ఈరోజు ఉదయం ‘పుష్ప’ నుంచి రష్మిక మందన్న లుక్ కు సంబంధించిన పిక్ విడుదల చేశారు. అది కూడా ట్విట్టర్ లో ‘తగ్గేదే లే, రష్మిక మందన్న, సోల్ మేట్ అఫ్ పుష్పరాజ్’తో పాటు అల్లు స్నేహారెడ్డి కూడా ట్రెండ్ అవుతోంది. ఈ పోస్టర్ లో రష్మిక మందన్న నో మేకప్ లుక్ లో ఆకట్టుకుంటోంది.

-Advertisement-మోస్ట్ స్పెషల్ పర్సన్ ఇన్ మై లైఫ్… భార్యకు బన్నీ విషెస్

Related Articles

Latest Articles