“ఫన్ అండ్ ఫ్రస్టేషన్”లో ఐకాన్ స్టార్… సెట్ లో హంగామా

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న బ్లాక్ బస్టర్ మూవీ “ఎఫ్2” సీక్వెల్ “ఎఫ్ 3”. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ట్రిపుల్ ఫన్ సిద్ధమవుతోంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. “ఎఫ్ 3″ని దిల్ రాజు సమర్పిస్తుండగా, శిరీష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మెహ్రీన్, తమన్నా హీరోయిన్లుగా, రాజేంద్ర ప్రసాద్, సునీల్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Read Also : “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” అన్నయ్యే స్పెషల్ గెస్ట్ గా!

ఈ రోజు “ఎఫ్ 3” సెట్స్‌ కు ఓ ప్రత్యేక అతిథి విచ్చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అనుకోకుండా “ఎఫ్ 3” సెట్స్‌కి వెళ్లారు. దీంతో హంగామా డబుల్ అయ్యింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అల్లు అర్జున్ హీరోలు విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రాజేంద్ర ప్రసాద్, సునీల్, దర్శకుడు అనిల్ రావిపూడి చర్చించుకుంటున్న ఫోటోలను షేర్ చేశారు మేకర్స్. అలా అల్లు అర్జున్ అనుకోకుండా సెట్స్ కి రావడంతో అక్కడ సందడి నెలకొంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో “ఎఫ్ 3” కీలకమైన, సుదీర్ఘమైన షూటింగ్ షెడ్యూల్ జరుగుతోంది. ప్రధాన తారాగణంతో పాటు, ఇతర ఆర్టిస్టులు కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు.

Image
Image
Image
-Advertisement-"ఫన్ అండ్ ఫ్రస్టేషన్"లో ఐకాన్ స్టార్… సెట్ లో హంగామా

Related Articles

Latest Articles