విజయ్ దేవరకొండ బాటలో అల్లు అర్జున్… త్వరలో ‘ఏఏ’ బ్రాండ్‌ దుస్తులు

టాలీవుడ్ లో ఫ్యాషన్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ స్టైలిష్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లు వారబ్బాయి అల్లు అర్జున్. ఈ ఐకాన్ స్టార్ నటించిన ‘పుష్ప’ తొలి భాగం ఇటీవల విడుదలై చక్కటి విజయాన్ని సాధించింది. నెగెటీవ్ టాక్ తో మొదలైన ఈ సినిమా ఇప్పుడు విజయవంతం అయిందంటే దానికి కారణం అల్లు అర్జున్ అని ఒప్పుకోక తప్పదు. ఇటీవల కాలం వరకూ తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళకే పరిమితం అయిన బన్ని ఇమేజ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పాకింది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మెగాఇమేజ్ నుంచి బయటపడి తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ ని సంపాదించుకున్న బన్నీ ఇప్పుడు విజయ్ దేవరకొండ బాటలో సొంతంగా దుస్తుల వ్యాపారం ఆరంభించబోతున్నాడట. విజయ్ రౌడీవేర్ ఇప్పటికే మార్కెట్ తో తమదైన ముద్రవేశాయి.

Read Also : ఏపీలో థియేటర్ల సమస్యపై మాట్లాడతా… – మంత్రి తలసాని

ఇప్పటికే తన ఇమేజ్ ని ఎఎ బ్రాండ్ రూపంలో ప్రమోట్ చేస్తూ వస్తున్న అల్లు అర్జున్ తను ఆరంభించబోయే దుస్తులకు కూడా ఎఎ బ్రాండ్ వేర్ గా మార్కెట్ లోకి తీసుకు రాబోతున్నాడట. అతి త్వరలో వీటిని మార్కెట్లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బ్రాండింగ్ ఏజెన్సీలు, పెట్టుబడిదారులతో సమావేశాలను నిర్విహించారు. ప్రస్తుతం కోవిడ్ మూడోవేవ్ ఉదృతంగా ఉన్నందువల్ల ఎఎబ్రాండ్ లాంచింగ్ కొద్దిగా ఆలస్యం అయిందని లేకుంటే ఈ పాటికే ఎఎబ్రాండ్ మార్కెట్ లో ఉండి ఉండేదని చెబుతున్నారు. పరిస్థితులు మామూలు స్థితికి చేరగానే బన్నీ ఎఎ బ్రాండ్ లాంచ్ అవుతుందని అంటున్నారు. ఇప్పటికే బన్నీ థియేటర్ బిజినెస్ లోకి కూడా ఎంటర్ అయ్యాడు. అమీర్ పేటలో సత్యం థియేటర్ స్థానంలో ఏషియన్ సినిమాస్ తో కలసి మల్టీప్లెక్స్ ను అందుబాటులోకి తీసుకు వస్తున్నాడు. ఇప్పుడు తన ఎఎ బ్రాండ్ ను వస్త్ర వ్యాపారంపైకి కూడా మళ్ళించాడు. మరి ఈ కొత్త బిజినెస్ లలో బన్నీ ఎలాంటి విజయాలను అందుకుంటాడన్నది చూడాలి. అంతే కాదు ఇంకా ఏ ఏ బిజినెస్ లలోకి అల్లు అర్జున్ తన ఎఎ బ్రాండ్ ను విస్తరింప చేస్తాడో చూద్దాం.

Related Articles

Latest Articles