బిగ్ బ్రేకింగ్: బాలయ్య కోసం బరిలోకి దిగిన ఐకాన్ స్టార్

టాలీవుడ్ స్టార్ హీరోలందరు ఒకే తాటిపై నడుస్తారు. స్టార్ హీరోల మధ్య పోటీ సినిమాల వరకే కానీ, నిజజీవితంలో నిత్యం హీరోలందరూ కలిసిమెలిసి ఉంటారు అనేది నమ్మదగిన విషయం. ఒకరి సినిమా గురించి మరొకరు.. ఒకరి ప్రీ రిలీజ్ ఈవెంట్లకు మరొకరు గెస్ట్ లుగా వచ్చి వారి సినిమాలను ప్రమోట్ చేస్తారు. ఇలా వచ్చే అతిధుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి. ఇకపోతే ప్రస్తుతం బన్నీ మరో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా రానున్నాడు. నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా విచ్చేయనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 27 న శిల్ప‌క‌ళావేదిక‌లో అట్ట‌హాసంగా జరగబోయే ఈ వేడుకలో బాలకృష్ణతో కలిసి అల్లు అర్జున్ సందడి చేయనున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది.

Related Articles

Latest Articles