బుల్లితెరపై ఐకాన్ స్టార్ సందడి.. తగ్గేదే లే..!!

ఈటీవీలో ప్రసారమయ్యే డ్యాన్స్ షో ‘ఢీ’ సిరీస్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే 12 సీజన్‌లు విజయవంతంగా ముగిశాయి. ప్రస్తుతం 13వ సీజన్‌ హాట్‌హాట్‌గా కొనసాగుతోంది. కింగ్స్ వర్సెస్ క్వీన్స్ అంటూ అబ్బాయిలు, అమ్మాయిలు తమ స్టెప్పులతో వీక్షకులను మెస్మరైజ్ చేస్తున్నారు. ప్రస్తుతం సెమీఫైనల్ పోరు నడుస్తోంది. త్వరలోనే గ్రాండ్ ఫినాలే జరగబోతోంది. అయితే గ్రాండ్ ఫినాలేకు టాలీవుడ్ అగ్రహీరో గెస్టుగా రాబోతున్నాడు. అతడు ఎవరో కాదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎన్టీఆర్, అల్లు అర్జున్ డ్యాన్సుల్లో ఎవరికీ సాటిరారనే విషయం తెలిసిందే. ఢీ12 సీజన్‌లో గ్రాండ్ ఫినాలేకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఇప్పుడు అల్లు అర్జున్ వంతు వచ్చింది. సెమీఫైనల్‌ పోరులో కింగ్స్ వర్సెస్ క్వీన్స్ నుంచి నలుగురు సభ్యులు ఎంపిక అవుతారు. వీరిలో అల్లు అర్జున్ చేతుల మీదుగా ఢీ13 టైటిల్ ఎవరు అందుకుంటారో వేచి చూడాలి. త్వరలోనే ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

Read Also: ఎన్టీఆర్ చాలా డేంజర్ అన్న మహేష్ బాబు

ఇక పోతే.. వచ్చే వారం బుల్లితెర షేక్ కానుంది. ఎందుకంటే ఒకవైపు ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమానికి సూపర్ స్టార్ మహేష్‌బాబు ముఖ్య అతిథిగా హాజరుకానుండగా… అలీతో సరదాగా కార్యక్రమానికి స్టార్ కమెడియన్ బ్రహ్మానందం వస్తున్నాడు. ఇప్పుడు ఢీ13 గ్రాండ్ ఫినాలేకు అల్లు అర్జున్ వస్తున్నాడని ఖరారు కావడంతో వచ్చేవారం బుల్లితెర ప్రేక్షకులకు ట్రిపుల్ డోస్‌లో వినోదాల విందు అందనుంది.

Related Articles

Latest Articles