‘పుష్ప’ మాస్ రగ్గడ్ లుక్.. బన్నీ ఫేవరేట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం పుష్ప రాజ్ గా మారిపోయాడు. ఎక్కడ చూసినా బన్నీ.. పుష్ప లుక్ లోనే కనిపిస్తున్నాడు. నీ యవ్వ తగ్గేదేలే అంటూ పుష్ప అటు థియేటర్ లోనూ.. ఇటు ఓటిటీలోను హల్చల్ చేస్తోంది. ఇక పుష్ప మొదటి పార్ట్ విజయం సాధించడంతో ఆనందంలో ఉన్న బన్నీ ప్రస్తుతం ఇంట్లో పిల్లలతో సమయాన్ని గడుపుతున్నాడు. ఇక పుష్ప ఓటిటీ కి వచ్చిన సందర్భంగా బన్నీ పుష్ప లోని తన ఫేవరేట్ స్టిల్ ని అభిమానులతో పంచుకున్నారు.

గంధపు చెక్కల స్మగ్లర్ పుష్ప రాజ్.. ఊర మాస్ రగ్గడ్ గెటప్పులో ఉన్న స్టిల్ అది.. మాసిన గడ్డం .. ఒళ్లంత మట్టి.. నోట్లో బీడీ.. కిల్లింగ్ చూపుతో బన్నీ పూర్తిగా పుష్ప రాజ్ గా మారిపోయిన ఫోటో అది. ఈ స్టిల్ ఫేవరేట్ అని బన్నీ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ చాలా కష్టపడ్డాడని చాలా సార్లు .. చాలామంది చెప్పుకొచ్చారు. ఈ ఫోటో అందుకు సాక్ష్యం.. ఒక హీరో పాత్ర కోసం అంత పర్ఫెక్ట్ గా మారడం అంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని. అది బన్నీ వలనే సాధ్యమవుతుందని అభిమానులు కొనియాడేస్తున్నారు.

Related Articles

Latest Articles