నేను ఇక్కడికి వచ్చింది ఆయన కోసమే: అల్లు అర్జున్

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ విన్నా అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించే చర్చ. ఎప్పుడైతే ఈ ఈవెంట్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వస్తున్నాడని అనౌన్స్ చేసారో అప్పటినుంచి ఈ ఈవెంట్ హాట్ టాపిక్ గా మారింది. అసలు అల్లు అర్జున్ ఈ వేడుకకు రావడానికి గల కారణం ఏంటి..? బాలయ్య బాబు- అల్లు అరవింద్ ల మధ్య బంధమా..? లేక పుష్ప ప్రమోషన్స్ కోసమా అని అందరు రకరకాలుగా ఊహించేసుకున్నారు.

ఇక తాజాగా ఈ వేడుకలో ఈ ఊహాగానాలకు చెక్ పెట్టాడు బన్నీ.. తాను ఈ వేడుకకు రావడానికి ప్రధాన కారణం ఎవరో వేదికపై చెప్పేశాడు. ” నేను ఈ ఈవెంట్ కి రావడానికి కారణం బోయపాటి శ్రీను.. ఆయన కోసమే ఈ వేడుకకు వచ్చాను. బోయపాటి శ్రీను గారు నాకు ఫస్ట్ సినిమా చేయకముందు నుంచే పరిచయం .. ఆయనంటే ఎంతో ఇష్టం. నాకు భద్ర సినిమా చెప్పారు.. ఆర్య సినిమా కోసం నేను దానిని వదులుకున్నాను.. శ్రీను జర్నీని నేను అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి చూసాను. ఆయన మంచి డైరెక్టర్ అవుతారని నాకు అప్పుడే తెలుసు. ఈరోజు శ్రీను ఒక టాప్ డైరెక్టర్ గా ఉండడం నాకు ఎంతో ఆనందంగా ఉందని” చెప్పారు. దీంతో ఇప్పటివరకు వచ్చిన రూమర్స్ కి చెక్ పడినట్లే..

Related Articles

Latest Articles