‘షేర్షా’ని ప్రతి భారతీయుడు చూడాలంటున్న అల్లు అర్జున్

కెప్టెన్ విశాల్ బత్రా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘షేర్షా’ని ప్రతి భారతీయుడు తప్పక చూడాలి అని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటున్నారు. బన్నీ బుధవారం షేర్షాను వీక్షించారు. సినిమా ఎంతగానో నచ్చటంతో తన భావోద్వాగాన్ని ట్విటర్ లో పంచుకున్నారు. అంతే కాదు యూనిట్ లో భాగమైన ప్రతి ఒక్కరినీ ప్రశంసించారు. “షేర్షా బృందానికి అభినందనలు. హృదయానికి హత్తుకునే సినిమా ఇది. టైటిల్ పాత్ర పోషించిన సిద్ధార్ధ్ మల్హోత్రా తన కెరీర్ లో ఉత్తమ ప్రదర్శన చేశాడు. కైరా అద్వానీతో పాటు ఇతర నటీనటులు కూడా చక్కటి నటనను ప్రదర్శించారు. దర్శకుడు విష్ణువర్ధన్ కన్విక్షన్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇలాంటి గర్వపడే సినిమా తీసిన నిర్మాత కరణ్ జోహార్ కి అభినందనలు. ప్రతి భారతీయుడు తప్పక చూడవలసిన సినిమా ఇది’ అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేసారు.

Read Also: పవన్ బర్త్ డే : సినిమాల్లో ‘పవర్’ రాజకీయాల్లో చూపించగలడా…?

ఇంతకు ముందే ఉలగనాయకుడు కమల్ హాసన్ కూడా ‘షేర్షా’పై ప్రశంసల వర్షం కురిపించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా ఈ సినిమా ప్రస్తుతం తమ ప్లాట్‌ఫామ్‌లో నంబర్ వన్ సినిమాగా ప్రకటించింది. 1999 లో కార్గిల్ పోరులో పాకిస్తాన్ చొరబాటుదారుల నుండి భారత భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకునే క్రమంలో ప్రాణాలు అర్పించిన కెప్టెన్ విశాల్ బత్రా జీవిత చరిత్రగా తెరకెక్కిన ఈ సినిమాలో టైటిల్ పాత్రను సిద్ధార్థ్ మల్హోత్రా పోషించారు. విష్ణు వర్ధన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్, కాష్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించాయి.

Related Articles

Latest Articles

-Advertisement-