మాస్ జాతర… ‘అఖండ’ మరో ట్రైలర్ విడుదల

నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ సినిమా నుంచి మరో ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్‌ను ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విడుదల చేశాడు. ఈ ట్రైలర్‌ను మాస్ అంశాలు, పంచ్ డైలాగులతో నింపేశారు. నేనే త్రిపురనాసిక రక్షకుడు.. శివుడు అంటూ బాలయ్య గంభీరంగా చెప్పే డైలాగ్ అదిరిపోయింది. ‘మేం ఎక్కడికైనా వెళ్తే తలదించుకోం.. తలతెంచుకుని వెళ్లిపోతాం’ అంటూ విలన్‌ను హెచ్చరించే సీన్ అయితే అభిమానుల చేత విజిల్స్ వేయించేలా ఉంది. ‘దేవుడిని కరుణించమని అడుగు.. కనిపించమని కాదు’ అంటూ బాలయ్య చెప్పిన మరో డైలాగ్ కూడా మాస్ ప్రేక్షకులను అలరిస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీలో అఘోరాగా బాలయ్య గెటప్ అదిరిపోయింది. బాలకృష్ణ కెరీర్ లోనే ఇది గుర్తుండిపోయే క్యారక్టర్ అవుతుందని చెప్పవచ్చు. కాగా డిసెంబర్ 2న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. బాలయ్య-బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న మూడో మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Related Articles

Latest Articles