‘పుష్ప’ టీజర్.. ఆల్‌టైమ్ రికార్డు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘పుష్ప’. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం ‘పుష్ప ది రైజ్’ డిసెంబర్ 17న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో పుష్ప సందడి మాములుగా ఉండటం లేదు. ఇప్పటికే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్, లిరికల్ సాంగ్స్, పోస్టర్స్, గెటప్స్ ఇలా ఒక్కటి అని కాకుండా ప్రతిదీ ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టీజర్ అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డు బద్దలు కొట్టింది.

Read Also: మరోసారి మంచి మనస్సు చాటుకున్న బర్నింగ్ స్టార్

‘పుష్ప’ టీజర్ వీడియోకి యూ ట్యూబ్‌లో 89 మిలియన్ వ్యూస్ రావడం ఒక రికార్డ్ అయితే.. 2 మిలియన్‌లకు పైగా లైక్స్ రావడం విశేషం. ఈ స్థాయిలో లైకులు వచ్చిన తొలి తెలుగు టీజర్‌గా ‘పుష్ప ది రైజ్’ నిలిచింది. దీంతో బన్నీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మరోవైపు ఈ టీజర్‌కు 466K కామెంట్స్ వచ్చాయంటే ఈ సినిమా మీద తెలుగు ప్రేక్షకులలో ఎంతగా చర్చ జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు. సినిమా విడుదల కాకుండానే రికార్డులు సృష్టిస్తున్న పుష్ప.. .విడుదలయ్యాక ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో అంటూ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన రష్మిక హీరోయిన్‌గా నటిస్తుండగా… రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు.

'పుష్ప' టీజర్.. ఆల్‌టైమ్ రికార్డు

Related Articles

Latest Articles