పర్యావరణ దినోత్సవం: మొక్కలు నాటిన ‘పుష్ప’రాజ్

నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ 5) సందర్భంగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందేశాన్ని ఇచ్చారు. “పర్యావరణానికి అనుకూలమైన అలవాట్లను అలవర్చుకోవాలని పిలుపునిచ్చాడు. ప్రకృతితో కలిసిపోతూ, అది ఏం చేసిన అభినందించాలని కోరాడు. ముందటి తరాల కోసం.. ఈ భూగ్రహాన్ని మరింత పచ్చగా మారుద్దమన్నారు. గ్రీనరీ కోసం ప్రతి ఒక్కరు చొరవ తీసుకుని మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశాడు. ఈమేరకు మొక్కలు నాటిన బన్నీ, అభిమానులు నాటిన మొక్కలు కూడా తనతో పంచుకోవాలని కోరాడు.

కాగా, ఇటీవల బన్నీ కరోనా నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో బన్ని సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో తెరకెక్కిస్తున్నారు. కాగా, పుష్ప ఇంట్రడక్షన్ వీడియో యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. తెలుగు ఇండస్ట్రీలో అత్యంత వేగంగా 70 మిలియన్ వ్యూస్ మార్క్ అందుకున్న తొలి ఇంట్రడక్షన్ వీడియోగా అల్లు అర్జున్ పుష్ప చరిత్ర సృష్టించింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-