బాలీవుడ్ స్టార్ తో బన్నీ మల్టీస్టారర్… అల్లు అరవింద్ లెక్క మాములుగా లేదుగా !

బాలీవుడ్ స్టార్ తో బన్నీ మల్టీస్టారర్ చేయబోతున్నాడు. టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం భారీగానే సన్నాహాలు మొదలెట్టినట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే… “జెర్సీ” హిందీ ట్రైలర్ లాంచ్ నవంబర్ 23న జరిగింది. ప్రధాన తారలు షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, అమన్ గిల్, మీడియా, ప్రేక్షకులు కూడా ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వచ్చారు. దీంతో ఊహించిన విధంగా చిత్రబృందానికి చాలా ప్రశ్నలే ఎదురయ్యాయి.

Read Also : పెళ్ళికి ముందు కత్రినా, విక్కీ కోర్టు మ్యారేజ్… ఇలా ఎందుకో తెలుసా ?

అల్లు అరవింద్ ని బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ తో పాన్ ఇండియా మల్టీస్టారర్ ను ప్లాన్ చేస్తున్నారా? అని మీడియా ప్రశ్నించింది. దీంతో అల్లు అరవింద్ కు కొన్ని వివరాలను బయట పెట్టక తప్పలేదు. “నా మనసులో ఆలోచన రాలేదని నేను చెప్పను, ప్రణాళికలు ఉన్నాయి. ప్రాజెక్ట్ గురించి చర్చలు జరుగుతున్నాయి. కానీ వాటి గురించి మాట్లాడటానికి ఇది సరైన స్థలం లేదా వేదిక కాదు. ఈ రోజు ఇది కేవలం ‘జెర్సీ’ గురించి మాత్రమే. దానిపై దృష్టి పెడదాం. సమయం వచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన విషయాలను వెల్లడిస్తాము” అని అల్లు అరవింద్ సమాధానం ఇచ్చారు. దీంతో ‘జెర్సీ’ హీరో షాహిద్ కపూర్, అల్లు అర్జున్ తో కలిసి అరవింద్ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడనే ప్రచారం ఊపందుకుంది.

Related Articles

Latest Articles