స్ట్రయిట్ హిందీ చిత్రంపై ఐకాన్ స్టార్ దృష్టి!

ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’లో నటిస్తున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మూవీ చేయాల్సి ఉంది. కానీ దానికి మరికాస్తంత సమయం పట్టేలా ఉంది. ఎందుకంటే చిరంజీవి ‘ఆచార్య’ తర్వాత కొరటాల శివ యంగ్ టైగర్ ఎన్టీయార్ తో మూవీ చేస్తానని మాటిచ్చారు. సో… ఆ తర్వాతే బన్నీ – కొరటాల శివ మూవీ ఉంటుంది. సో… ఈ లోగా వేరే దర్శకులతో సినిమా చేయడానికి అల్లు అర్జున్ మెంటల్ గా ప్రిపేర్ అవుతున్నారు. అంతే కాదు… కథలు సైతం వింటున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే… దక్షిణాదికి చెందిన ధనుష్, దుల్కర్ సల్మాన్ వంటి యంగ్ హీరోస్ ఇప్పుడు స్ట్రయిట్ హిందీ సినిమాలు కూడా చేస్తున్నారు. మంచి విజయాలను తమ ఖాతాలో నమోదు చేసుకుంటున్నారు. కాబట్టి ‘పుష్ప’ తర్వాత పాన్ ఇండియా మూవీ కాకుండా… స్ట్రయిట్ హిందీ సినిమా చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలోనూ బన్నీ పడినట్టు తెలుస్తోంది. ఎందుకంటే మిగిలిన సౌతిండియన్ హీరోల కంటే కూడా అల్లు అర్జున్ కు హిందీ సినిమా చేయడంలో ఓ సౌలభ్యం ఉంది. అతని తండ్రి ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఇప్పటికే కొన్ని హిందీ సినిమాలు నిర్మించారు. కొంత గ్యాప్ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ హిందీ మూవీస్ ప్రొడక్షన్ ప్రారంభించారు. సో… ఆయనకు ఉన్న పరిచయాలను బలోపేతం చేసుకుంటూ, బన్నీ స్ట్రయిట్ హిందీ సినిమాను ‘పుష్ప’ తర్వాత చేసే ఛాన్స్ కూడా ఉందని సన్నిహితులు చెబుతున్నారు. అయితే.. ఆ మధ్య రామ్ చరణ్ కూడా బాలీవుడ్ మీద మోజుతో ఠక్కున అమితాబ్ ‘జంజీర్’ ను హిందీలోనే రీమేక్ చేసి, చేదు అనుభవాన్ని పొందాడు. అలాంటి పరిస్థితి తనకు రాకూడదని అనేక ముందు జాగ్రత్తలను బన్నీ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. బన్నీ బాలీవుడ్ ఎంట్రీకి పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ దోహదకారి అవుతుందనడంలో సందేహం లేదు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-