మాల్దీవులలో ఫ్యామిలీతో బన్నీ- ఈ ఏడాది రెండోసారి

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ ‘పుష్ప’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 17 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుందని మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్ లో చిన్న విరామ సమయంలో అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి మాల్దీవులకు వెళ్లారు. ఈ ట్రిప్ తో బన్నీ తనను తాను రిఫ్రెష్ చేసుకుని, ఈ వారాంతంలో తిరిగి వస్తాడు. బన్నీ తన పిల్లలతో కలిసి మాల్దీవులలో కొంత క్వాలిటీ సమయం గడుపుతున్నారు. అల్లు అర్జున్ భార్య స్నేహ వారి హాలీడేస్ కు సంబంధించిన ఓ చిన్న వీడియోను పోస్ట్ చేసింది.

Read Also : సాంగ్ : ‘శ్రీవల్లి’పై ‘పుష్ప’రాజ్ మెలోడియస్ ఫీలింగ్స్

ఈ ట్రిప్ నుంచి తిరిగొచ్చిన తరువాత, వచ్చే వారం అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రీకరణను తిరిగి ప్రారంభించనున్నారు. నవంబర్ మధ్యలో షూటింగ్ ను పూర్తి చేస్తాడు. రష్మిక మందన్న ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుండగా, ఫహద్ ఫాసిల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ప్రస్తుతం అల్లు అర్జున్ మాల్దీవుల ట్రిప్ కు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

-Advertisement-మాల్దీవులలో ఫ్యామిలీతో బన్నీ- ఈ ఏడాది రెండోసారి

Related Articles

Latest Articles