సింప్లిసిటీ: రోడ్ సైడ్ హోట‌ల్‌లో టిఫిన్ చేసిన అల్లు అర్జున్

మెగా హీరోలు సింప్లిసిటీ లైఫ్ ని ఎంతగా ఇష్టపడతారో అందరికి తెలిసిందే.. అది మరోసారి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ద్వారా రుజువైంది. ప్రస్తుతం ‘పుష్ప’ సినిమా షూటింగ్ లో బిజీగా వున్నా బన్నీ.. టిఫిన్ చేయడానికి రోడ్ సైడ్ వున్నా చిన్న హోటల్ కి వెళ్లి తిన్నారు. ‘పుష్ప’ షూటింగ్ మధ్యలో లభించిన బ్రేక్ సమయంలో కాకినాడలోని థియేటర్‌లో ‘సీటీమార్‌’ చిత్రాన్ని అల్లు అర్జున్‌ వీక్షించారు. అయితే అల్లు అర్జున్ గోక‌వ‌రం ద‌గ్గ‌ర రోడ్డు సైడ్ టిఫిన్ సెంట‌ర్‌లో టిఫిన్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ అభిమాని చిత్రీకరించారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. టిఫిన్ సెంట‌ర్ వాళ్ళకి డ‌బ్బులు ఇస్తుండ‌డం కూడా వీడియోలో క‌నిపిస్తుంది.

మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది.. ప్రముఖ మలయాళం యాక్టర్ ఫాహద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ముగియనున్నది.

Related Articles

Latest Articles

-Advertisement-