ఇది సార్ అల్లు అర్జున్ బ్రాండ్.. ‘సౌత్ కా సుల్తాన్’

ఇంకొం స్టార్ అల్లు అర్జున్ మరో రికార్డ్ ని కొట్టేశాడు. ఇప్పటికే ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో రికార్డులను కొల్లగొట్టిన బన్నీ తాజాగా సోషల్ మీడియాలో మరో రేర్ రికార్డ్ క్రియేట్ చేసాడు. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కి ఉన్న ఫాలోయింగ్ మామూలుది కాదు. ఆయన పెట్టె పోస్ట్ కి.. కామెంట్స్ కి అభిమానులు హంగామా చేయడం చూస్తే మతిపోతుంది. ఇక ప్రతి చిన్న విషయాన్ని బన్నీ, తన అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. సినిమాకి సంబంధించిన, కుటుంబానికి సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలుపుతూ ఉంటాడు. సోషల్ మీడియాలో సౌత్ ఇండస్ట్రీలో మరే హీరోకు సాధ్యం కాని రీతిలో ఈయనకు ఫాలోయర్స్ పెరిగిపోతున్నారు.

ఇక తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఏకంగా 15 మిలియన్ల ఫాలోయర్స్ ని సొంతం చేసుకున్నాడు బన్నీ. అంటే కోటి 50 లక్షల మంది ఫాలోయర్స్ అల్లు అర్జున్ ఖాతాను ఫాలో అవుతున్నారు. ఇప్పటివరకు ఈ ఘనతను ఏ సౌత్ ఇండియన్ స్టార్ సాధించలేదు. మొట్టమొదటి సౌత్ ఇండియన్ స్టార్ అల్లు అర్జున్ ఈ రికార్డ్ ని బద్దలు కొట్టాడు. ఈ విషయాన్ని బన్నీ తన సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ” మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు.. వినయ పూర్వకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను” అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న బన్నీ అభిమానులు పుష్ప స్టైల్లో కామెంట్స్ పెడుతున్నారు. ఇది సార్.. అల్లు అర్జున్ బ్రాండ్ అంటే.. సౌత్ కా సుల్తాన్ అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు.

Related Articles

Latest Articles