హ్యాపీ బర్త్ డే మై గ్రేటెస్ట్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ : అల్లు అర్జున్

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బన్నీ వాసుకి సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభకాంక్షలు తెలిపారు. “హ్యాపీ బర్త్ డే వాసు. ఇన్ని సంవత్సరాలుగా మై గ్రేటెస్ట్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్” అంటూ ట్వీట్ చేశారు అల్లు అర్జున్. అల్లు అర్జున్ కు నిర్మాత బన్నీ వాసు సన్నిహితుడు అన్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలోని 100% లవ్, పిల్లా నువ్వు లేని జీవితం, భలే భలే మగాడివోయ్, చావు కబురు చల్లగా (2021) సినిమాలకు బన్నీ వాసు నిర్మాణ సారధ్యం వహించాడు. ఆయన గీతా ఆర్ట్స్ ను ముందుకు తీసుకొని వెళ్ళే వ్యక్తులలో ఒకరు. అంతేకాదు బన్నీకి మంచి స్నేహితుడు కావడంతో ఆయనను బన్నీ వాసు అని పిలుస్తారు. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం “పుష్ప” చిత్రంతో బిజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో ఎర్ర చందనం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-