బాలీవుడ్ మూవీ ‘షహజాదా’లో గెస్ట్ గా బన్నీ!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సూపర్ డూపర్ హిట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ హిందీలో ‘షహజాదా’గా రీమేక్ కాబోతున్న విషయం తెలిసిందే. ఇక్కడ అల్లు అర్జున్, పూజా హెగ్డే పోషించిన పాత్రలను హిందీలో కార్తీక్ ఆర్యన్, కృతీ సనన్ పోషించబోతున్నారు. పరేశ్ రావెల్, మనీషా కొయిరాలా సైతం కీలక పాత్రలకు ఎంపికైనట్టు తెలుస్తోంది. వరుసగా రెండు పెద్ద బ్యానర్స్ నుండి కార్తీక్ ఆర్యన్ ను తప్పించిన నేపథ్యంలో ‘అల వైకుంఠపురములో’ హిందీ రీమేక్ ఆఫర్ రావడం అందరినీ ఆశ్చర్యపర్చింది. అతని అభిమానులను సంతోషపర్చింది.

Read Also: రేపటి నుండి తెలంగాణాలో థియేటర్లు తెరచుకుంటున్నాయి!

మరో విశేషమేమంటే… ఈ సినిమాలో అల్లు అర్జున్ గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వబోతున్నాడనే ప్రచారం బాలీవుడ్ మీడియాలో విపరీతంగా జరుగుతోంది. నిజానికి పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’తో అల్లు అర్జున్ బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వెళ్ళబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలోనూ అతిథి పాత్ర చేయమని దర్శక నిర్మాతలు కోరుతున్నారట. ‘అల వైకుంఠపురములో’ హిందీ రీమేక్ రైట్స్ దాదాపు రూ. 9 కోట్ల వరకూ పలికాయని తెలుస్తోంది. ఇక ‘షహజాదా’ పేరుతో గతంలోనే రాజేశ్‌ ఖన్నా ఓ సినిమా చేశారు. ఇప్పుడు అదే టైటిల్ తో కార్తీక్ ఆర్యన్ మూవీ చేయడం విశేషం. దీన్ని డేవిడ్ ధావన్ తనయుడు రోహిత్ ధావన్ తీయబోతున్నాడు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-