శభాష్ “షేర్షా”… హార్ట్ టచింగ్ : అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “షేర్షా”ను బుధవారం వీక్షించారు. అల్లు అర్జున్ కు సినిమా బాగా నచ్చింది. టీమ్‌లో భాగమైన ప్రతి ఒక్కరినీ ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. వరుస ట్వీట్లతో సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “షేర్షా బృందానికి అభినందనలు. హృదయానికి హత్తుకునే సినిమా. మిస్టర్ మల్హోత్రా కెరీర్ లోనే ఇది ఉత్తమ ప్రదర్శన. కియారా, ఇంకా ఇతర నటీనటులది అద్భుతమైన పర్ఫార్మెన్స్ . సినిమా టెక్నీషియన్స్ అందరికీ మై రెస్పెక్ట్. దర్శకుడు విష్ణు వర్ధన్ గారు ద్వారా అద్భుతమైన కన్విక్షన్. సర్ మీరు మా అందరిని గర్వపడేలా చేసారు. కరణ్ జోహార్ జీ, నిర్మాతలకు అభినందనలు. ఈ బ్లాక్ బస్టర్ హిట్ కోసం అమెజాన్ కు బిగ్ అభినందనలు. ప్రతి భారతీయుడు తప్పక చూడాలి” అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేసారు.

Read Also : పవన్ బర్త్ డే ట్రీట్స్… ఈ టైమింగ్స్ లోనే..!

కొన్ని రోజుల క్రితం కమల్ హాసన్ కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో “షేర్‌షా” ప్రస్తుతం తమ ప్లాట్‌ఫామ్‌లో నంబర్ వన్ ఫిల్మ్ అని ప్రకటించింది. 1999లో కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ చొరబాటుదారుల నుండి భారత భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకుంటూ దేశ సేవలో ప్రాణాలు అర్పించిన కెప్టెన్ విశాల్ బత్రా జీవిత చరిత్రగా తెరకెక్కిన ఈ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్ర పోషించారు. విష్ణు వర్ధన్ దర్శకత్వం వహించిన “షేర్షా”ను ధర్మ ప్రొడక్షన్స్, కాష్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు.

Related Articles

Latest Articles

-Advertisement-