మొన్న బన్నీ… ఇప్పుడు విజయ్ దేవరకొండ!

ఇన్ స్టాగ్రామ్ లో సౌత్ హీరోలలో అత్యధికంగా ఫాలోవర్స్ ను పొందిన స్టార్ గా అల్లు అర్జున్ రికార్డ్ సృష్టించాడు. ఆగస్ట్ 30వ తేదీతో అల్లు అర్జున్ ను ఇన్ స్టాగ్రామ్స్ లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 13 మిలియన్లకు చేరింది. అయితే… అప్పటికి విజయ్ దేవరకొండ 12.9 మిలియన్ ఫాలోవర్స్ ను కలిగి ఉన్నాడు. తాజాగా అతను సైతం సెప్టెంబర్ 2వ తేదీకి 13 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ కు చేరుకున్నాడు. విశేషం ఏమంటే… ఈ ఫీట్ ను అత్యంత తక్కువ సమయంలో సాధించిన హీరోగా సరికొత్త రికార్డ్ సృష్టించినట్టు తాజాగా విడుదలైన పోస్టర్ ద్వారా తెలిస్తోంది. ఏదేమైనా… అల్లు అర్జున్ – విజయ్ దేవర కొండ నువ్వా-నేనా అన్నట్టుగా సోషల్ మీడియా రేస్ లో సాగుతున్నారు.

మొన్న బన్నీ… ఇప్పుడు విజయ్ దేవరకొండ!

Related Articles

Latest Articles

-Advertisement-