క్రిస్మస్ పై కన్నేసిన ‘పుష్ప’!

తెలంగాణలో సినిమా ధియేటర్లు నూరు శాతం ఆక్యుపెన్సీతో జూన్ 20 నుండి తెరుచుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడో ఆదేశాలు ఇచ్చేసింది. కానీ ఇక్కడి ఎగ్జిబిటర్స్ లో ఉలుకూ పలుకూ లేదు. అలానే గురువారం నుండి యాభై శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరుచుకోమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం జీవో జారీ చేసింది. అంతేకాదు…. ఇంతవరకూ టిక్కెట్ రేట్ల విషయంలో పట్టుదలగా ఉన్న ప్రభుత్వం ఇప్పుడు కాస్తంత వెసులుబాటు కల్పించబోతోంది. అయినా పెద్ద సినిమాల నిర్మాతలు మాత్రం రెండు రాష్ట్రాలలో పూర్తి స్థాయిలో థియేటర్లు తెరుచుకుంటేనే తమ చిత్రాలను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

Read Also: ‘ఇండిపెండెన్స్ డే’కి ముందు… విమానాలతో బరిలోకి అజయ్ దేవగణ్!

నిజానికి ఈ యేడాది జనవరి, ఫిబ్రవరి మాసాలలో చాలా సినిమాలు యాభై శాతం ఆక్యుపెన్సీలోనే విడుదలై, మంచి విజయాలను అందుకున్న దాఖలాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో త్వరలో మీడియం బడ్జెట్ చిత్రాలు కొన్ని విడుదల కావచ్చు. కానీ పెద్ద సినిమాల నిర్మాతలు వేచిచూసే ధోరణిలో ఉన్నారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ టీమ్ సైతం ఇదే ధోరణిలో ఉన్నట్టు తెలుస్తోంది. దర్శక నిర్మాతలు ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని అనుకుంటున్నా, మొదటి భాగాన్ని కూడా హడావుడిగా రిలీజ్ చేయాలని మాత్రం భావించడం లేదట.

ఎందుకంటే… ఆగస్ట్ లో కరోనా థర్డ్ వేవ్ వచ్చే ఆస్కారం ఉందని, అది సర్దుమణగటానికి మూడు నెలలు పడుతుందని, సో… క్రిస్మస్ కానుకగా డిసెంబర్ చివరి వారంలో తమ చిత్రాన్ని విడుదల చేస్తే సేఫ్ అని ‘పుష్ప’ టీమ్ భావిస్తోందట. ఫిల్మ్ నగర్ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఈ యేడాది చివరిలోనే రావచ్చని తెలుస్తోంది. మరి ఈలోగా మేకర్స్ ఏమైనా అధికారిక ప్రకటన చేస్తారేమో చూడాలి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-