స్టార్ హీరోయిన్ సినిమాతో అల్లు అర్జున్ కూతురు ఎంట్రీ ?

అల్లు కుటుంబం నుంచి నాలుగవ తరం కూడా సినిమా ఎంట్రీకి సిద్ధంగా ఉందనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. లెజండరీ నటుడు అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్, అల్లు అర్జున్ ల తరువాత ఇప్పుడు బన్నీ కూతురు అల్లు అర్హా టాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్నట్లు కనిపిస్తోంది. అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఓ స్టార్ హీరోయిన్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోందట. ప్రస్తుతం సమంత “శాకుంతలం” అనే చిత్రంలో నటిస్తోంది. గుణశేఖర్ దర్శకత్వంలో ఈ మూవీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా రూపొందనుంది. ఇందులో ఓ కీలకమైన పాత్ర కోసం అల్లు అర్హను సంప్రదించారట మేకర్స్.

Read Also : పాన్ ఇండియా మూవీ లేకుండానే సత్తా చాటిన ప్రిన్స్ మహేశ్!

స్క్రిప్ట్ విన్న అల్లు ఫ్యామిలీ అల్లు అర్హ అరంగ్రేటానికి ఇది సరైన సమయమని భావిస్తున్నారట. అందుకే వారికీ ఓకే చెప్పారట. ఈ మేరకు అర్హా ఈ రోజు సెట్స్‌లో చేరనుంది. ఆమె 10 రోజుల షూటింగ్‌లో పాల్గొంటుందట. ఈ షెడ్యూల్‌తో ఆమె తన భాగానికి షూటింగ్ పూర్తి చేస్తుంది. అల్లు అర్హ తొలి చిత్రంతోనే భారీ తారాగణం, సిబ్బందితో పని చేయడమే కాకుండా గ్రాండ్ ఎంట్రీకి సిద్ధమైందన్న మాట.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-