‘తగ్గేదే లే’… అల్లు అర్హ వరల్డ్ రికార్డు

అల్లు అర్జున్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా దూసుకెళ్తుంటే మరోవైపు ఆయన కూతురు అల్లు అర్హ కూడా రికార్డులు బ్రేక్ చేసే చేసే పనిలో పడింది. అల్లు అర్హ క్యూట్ లుక్స్ కు ఇప్పటికే టాలీవుడ్ లో ఎంతో మంది ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సమంత పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’తో సినిమా ఎంట్రీ కూడా ఇవ్వబోతోంది. ఇదిలా ఉండగా సినిమాకు సంబంధం లేకుండా అల్లు అర్హ టాలెంట్ కు సంబంధించి మరో వార్త వైరల్ అవుతుంది. ఈరోజు అల్లు అర్హ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన ఫోటోలు వీడియోలతో పాటు ఆమె టాలెంట్ ను బయట పెడుతూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. అల్లు అర్హ నాలుగేళ్ల వయసులోనే ఏకంగా వరల్డ్ రికార్డు సృష్టించింది. చెస్ ఆటలో అర్హ నోబుల్ అవార్డును అందుకుంది. ఇంత చిన్న వయసులో అర్హ కేవలం చెస్ ఆడడమే కాకుండా ఎంతో మందికి ట్రైనింగ్ కూడా ఇస్తోందట.

Read Also : కంగనాపై సిక్కు కమ్యూనిటీ ఫైర్… కేసు నమోదు

హైదరాబాదులోని హైటెక్ సిటీకి చెందిన రాయ్ చెస్ అకాడమీలో అల్లు అర్హ శిక్షణ తీసుకుంది. రెండు నెలల్లోనే అర్హత సుమారుగా 50 మందికి పైగా ట్రైనింగ్ ఇచ్చి అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. చెస్ లో అల్లు అర్హ ప్రతిభను గుర్తించిన ప్రఖ్యాత నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధి ఆర్బిటర్ లింగం బాలాజీ పర్యవేక్షణలో అర్హకు చెస్ లో నైపుణ్య పరీక్ష నిర్వహించగా, అందులో ఆమె సత్తా చాటింది. చెస్ లో విశేషంగా ప్రతిభా పాటవాలను కనబర్చిన అల్లు అర్హ టాలెంట్ ను గుర్తించి నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ఆమెకు వరల్డ్ యంగెస్ట్ చెస్ ట్రైనర్ అవార్డును అందించారు. తల్లిదండ్రులైన అల్లు అర్జున్, సమక్షంలో అర్హత ఈ అవార్డును అందుకోవడం విశేషం. మరోవైపు సోషల్ మీడియాలో ఆమె పుట్టినరోజు సందర్భంగా బన్నీ అభిమానులు అల్లు అర్హ అని హ్యష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు.

Related Articles

Latest Articles