హిందీ పరిశ్రమ గొప్ప అనుకునే వాళ్లకు… అల్లు అరవింద్ కామెంట్స్

‘అన్స్టాపబుల్ విత్ ఎన్బికే’ టాక్ షో ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. బాలయ్య హోస్ట్ గా చేస్తున్న ఈ కార్యక్రమం లాంచ్ వేడుకలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ టాలీవుడ్ పరిశ్రమ గొప్పదనం, గౌరవం గురించి చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ “కేవలం తెలుగు వారి ఉత్సాహానికి, వెల్కమ్ కి ఒక ఉదాహరణ. తెలుగు వారు ఎంటర్టైన్మెంట్ అంటే ఇచ్చే ప్రాముఖ్యత. హిందీ పరిశ్రమ గొప్ప అనుకునే వాళ్లంతా తెలుగు ఇండస్ట్రీ అంటే ఒక గౌరవమైన చూపు చూస్తున్నారు. నేను అస్తమానూ బాంబే వెళ్తూ ఉంటాను. తెలుగు ఇండస్ట్రీ అంటే ఇది వరకు చూసే చూపులు తెలుసు… ఇప్పుడు వేరు !

Read Also : ‘ఆహా’ అసలు టార్గెట్ ఇదే !

ఎందుకంటే మన ఇండస్ట్రీ అల్ ఇండియా సౌండ్ చేసింది. అంటే ఈరోజు అన్ని పరిశ్రమల కన్నా తెలుగు పరిశ్రమ అని వారందరికీ అన్పించింది. ఎందుకు అంత గొప్పది అంటే… మీరు కారణం. ఫిలిం ఇండస్ట్రీని అంతగా ప్రోత్సహిస్తూ, ఉత్సాహపరుస్తూ ఉంటారు. ఈరోజు బిగ్గెస్ట్ కాస్ట్ తో సినిమా తెలుగులోనే తయారవుతున్నాయి. హిందీలో కాదు. ఎందుకంటే తెలుగు వారి సినిమాను ఆల్ ఇండియా చూడడానికి ప్రిపేర్ అయిన సమయం ఆరేళ్ళ కిందనే ‘బాహుబలి’తో వచ్చింది. అప్పటి నుంచి వేవ్ మారిపోయి అలా చూస్తున్నారు. ఇప్పుడు అటువంటి గౌరవం మనకు ఇస్తున్నారు. అటువంటి గౌరవం నిలబెట్టే పద్ధతిలోనే ‘ఆహా’ ఉంటుందని తెలియజేస్తున్నాను’ అంటూ ప్రసంగం ముగించారు అల్లు అరవింద్. కాగా ఈ షో నవంబర్ 4 న ప్రసారం కానుంది.

-Advertisement-హిందీ పరిశ్రమ గొప్ప అనుకునే వాళ్లకు… అల్లు అరవింద్ కామెంట్స్

Related Articles

Latest Articles