‘అన్స్టాపబుల్ విత్ ఎన్బికే’కు బాలయ్యే ఎందుకంటే ?

నందమూరి బాలకృష్ణ హోస్టుగా మారబోతున్న టాక్ షో ‘అన్స్టాపబుల్ విత్ ఎన్బికే’. ‘ఆహా’లో ప్రసారం కానున్న ఈ షో కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు నవరాత్రుల సందర్భంగా ఈ షోను గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ “బాలకృష్ణ తెరపైనే గొప్ప నటుడు… బయట ఆయన జీవిస్తూ ఉంటారు.. ఆయనకు కోపం వస్తే కోపం, సంతోషం వస్తే సంతోషం.. ఏదొస్తే అది నటించకుండా చూపించే మనస్తత్వం ఆయనది.

Read Also : ‘అన్స్టాపబుల్’ బాలయ్య… స్టార్టింగ్ లోనే అల్లు అరవింద్ పై సెటైర్

రియల్ ఎమోషన్స్ ను చూపించగల మనుషులు ఈ టాక్ షో చేస్తే ఎలా ఉంటుందో ? మీరు ఊహించుకోవచ్చు. ఎదుటి వ్యక్తి నుంచి ఏం తీసుకోవచ్చు ? వాళ్ళతో ఏం చెప్పిస్తే షోను రక్తి కట్టించొచ్చు ? అనే విషయాలు ఆయనకు బాగా తెలుసు. ఆయన ఇండస్ట్రీలో ఇన్ని ఏళ్ల నుంచి ఉన్నారో మనకు తెలుసు… కాకపోతే ఇంకా కుర్రోడిలా కన్పిస్తున్నారు. ఆయన అనుభవం అంతా ఈ షోలో పెడితే… బాలయ్యతో కలిసి షో చేస్తే ఎలా ఉంటుంది? అనగానే నా స్టాఫ్ అంతా కెవ్వుమని అరిచారు. అంటే బాగుంటుందని అంతగా ఎగ్జైట్ అయ్యారు. ఈ షోతో పాటు ‘అఖండ’ అఖండమైన సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఈ షోతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అంటూ బాలయ్యపై ప్రశంసల వర్షం కురిపించారు అల్లు అరవింద్.

-Advertisement-'అన్స్టాపబుల్ విత్ ఎన్బికే'కు బాలయ్యే ఎందుకంటే ?

Related Articles

Latest Articles