సమాజానికి కార్టూనిస్టుల సేవలు అవసరం: అల్లం నారాయణ

యూసు్‌ఫగూడ, జులై 16ప్రజల్లో చైతన్యం రగిలించగలిగే కార్టూన్లు అందించే శేఖర్‌ వంటి వారు సమాజానికి ఎంతో అవసరం అని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ అన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో కార్టూనిస్ట్‌ శేఖర్‌ మెమోరియల్‌ అవార్డు-2021 ప్రదానోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు. శేఖర్‌ లేనిలోటు తీర్చలేనిదని అల్లం నారాయణ పేర్కొన్నారు. ‘గిదీ తెలంగాణ’ అనే కార్టూన్‌ పుస్తకం ద్వారా ఉద్యమంలో శేఖర్‌ తన వంతు పోరాటం చేశారని చెప్పారు.

read also : ప్రముఖ సింగర్ కు వేధింపులు… వ్యక్తి అరెస్ట్

‘ఆంధ్రజ్యోతి’ సంపాదకుడు కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ శేఖర్‌కు రాజకీయ, సామాజిక అంశాలపై స్పష్టత ఉండేదని పేర్కొన్నారు. దక్కన్‌ క్రానికల్‌ కార్టూన్‌ ఎడిటర్‌ సుభానీకి అవార్డును ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఓయూ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా.ఎ్‌స.రఘు, సమాచార హక్కు చట్టం కమిషనర్‌ కట్టా శేఖర్‌రెడ్డి, పూర్వ టీఎ్‌సపీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి, ప్రజాశక్తి పూర్వ సంపాదకుడు తెలకపల్లి రవి, వరల్డ్‌ ప్రెస్‌ కార్టూన్‌ గ్రాండ్‌ ప్రి అవార్డ్‌ విజేత శంకర్‌, చంద్రకళ శేఖర్‌ పాల్గొన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-