సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ కి ఏర్పాట్లు పూర్తి…

సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ కి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.  43 వార్డు లకు బరిలో ఉన్న 236 మంది అభ్యర్థులు ఉండగా రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కౌంటింగ్ కి 15 టేబుల్స్ ఏర్పాటు చేయగా, ఒక్కో టేబుల్ కి మూడు వార్డ్ లు చొప్పున ఓట్లు లెక్కింపు జరుగుతుంది.  ఒక్కో టేబుల్ కి ఒక సూపర్ వైజర్, ఇద్దరు సిబ్బంది ఉంటారు. ఇక ఈ మున్సిపల్ ఎన్నికల్లో 67 శాతం ఓట్లు పోల్ కాగా, గత మున్సిపల్ ఎన్నికలతో పోలిస్తే 4 శాతం తగ్గింది ఓటింగ్.  అక్కడ మొత్తం ఓట్లు 100678 గాను 67339 ఓట్లు పోలయ్యాయి. సిద్దిపేట ఇందూరు ఇంజనీరింగ్ కాలేజ్ లో జరగనున్న కౌంటింగ్ హల్ లోకి అధికారులు, రాజకీయ పార్టీ ప్రతినిధులు కోవిడ్ నెగటివ్ రిపోర్ట్ ఉంటేనే  అనుమతి ఉంటుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-