కరీంనగర్‌లో ఎమ్మెల్సీ పోలింగ్‌కి సర్వం సిద్ధం

తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి కరీంనగర్‌లోని ఎమ్మెల్సీ ఎన్నికలు. రెండు స్థానాలకు పోలింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 72 గంటల ముందు సైలెంట్ పీరియడ్. ఈనెల 10వ తేదీన 8 గంటల నుండి 4 వరకూ పోలింగ్ నిర్వహిస్తారు. రెండు స్థానాలకు 8 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. కరీంనగర్ 2,జగిత్యాల 2 , పెద్దపల్లి 2, హుస్నాబాద్ 1, సిరిసిల్లలో ఒక పోలింగ్ కేంద్రం వుంది.

ఈ ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం ఓటర్లు 1324. పురుషులు 581 మంది, 743 మహిళలున్నారు. కరీంనగర్ లోని ఎస్ ఆర్ ఆర్ డిగ్రీ కాలేజీలో పోలింగ్ జరగనుంది. కౌంటింగ్ కు ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. ఒక్క బ్యాలెట్ లో 10 మంది అభ్యర్థులు ఉంటారు. నెంబర్ ప్రకారం అభ్యర్థి పేరు దగ్గర నెంబర్ వేయాలి. సంతకాలు, పేర్లు రాయడం, టిక్ లు పెడితే ఓటు చెల్లకుండా పోతుంది.

కేవలం ఎన్నికల కమిషన్ ఇచ్చిన పెన్ తోనే నెంబర్ వేయాలి. 10 వ తారీఖు పోలింగ్ నిర్వహించి 14న కౌంటింగ్ చేపడతారు. ఓటర్లు కరోనా నిబంధనలు పాటిస్తూ ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు కోరారు. కరోనా బాధితులు ఉన్నట్లు అయితే పీపీ కిట్ ధరించి ఓటు హక్కు వినియోగించుకోవాలి.
ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ కు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామని, పోలింగ్ , కౌంటింగ్ సైతం నిష్పక్షపాతంగా జరిగేలా భద్రత పరంగా ఏర్పాటు చేశామన్నారు కరీంనగర్ సీపీ సత్యనారాయణ తెలిపారు. 1113 మంది పోలీసులు, ఇన్‌ఛార్జ్ లు విధుల్లో ఉంటారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా భద్రత ఏర్పాటు చేస్తున్నామన్నారు.

Related Articles

Latest Articles