యూపీ పూర్వాంచ‌ల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ల్యాండింగ్ కానున్న ప్ర‌ధాని విమానం…

ప్ర‌ధాని మోడీ ఈరోజు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు.  ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని పూర్వాంచ‌ల్ ఎక్స్‌ప్రెస్ వే ను ప్రారంభించ‌బోతున్నారు.  భార‌త్ వాయుసేన‌కు చెందిన సీ 130 జె సూప‌ర్ హెర్క్యుల‌స్ విమానంలో ఎక్స్‌ప్రెస్ వే పై దిగ‌నున్నారు.  అనంతం ఎక్స్‌ప్రెస్‌వేను జాతికి అంకితం చేస్తారు.  340 కిలోమీట‌ర్ల పొడ‌వైన జాతీయ రహ‌దారిపై అక్క‌డ‌క్క‌డా వాయుసేన విమానాలు అత్య‌వ‌స‌రంగా ల్యాండింగ్ అయ్యేందుకు అనుగుణంగా సిమెంట్ వే ల‌ను నిర్మించారు.  

Read: న‌వంబ‌ర్ 16, మంగ‌ళ‌వారం దిన‌ఫ‌లాలు…

ఆదివారం రోజున వాయుసేన‌కు చెందిన ఎన్‌32, సుఖోయ్ 30, ఎంకెఐ, మిరాజ్ 200 విమానాలు ప్ర‌యోగాత్మకంగా ఎక్స్‌ప్రెస్‌వే పై ల్యాండ్ అయ్యాయి.  కాగా, ఈరోజు ప్ర‌ధాని వాయుసేన విమానంలో సుల్తాన్‌పూర్ జిల్లాలోని ఎక్స్‌ప్రెస్ వే పై దిగ‌నున్నారు.  వాయుసేన విమానాలు అత్య‌వ‌స‌రంగా ల్యాండింగ్ అయ్యేందుకు అనుగుణంగా రాజ‌స్థాన్‌లోని స‌త్తా-గాంధార్  ర‌హ‌దారిపై అత్య‌వ‌స‌ర ల్యాండింగ్ స్ట్రిప్‌ను ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే.  

Related Articles

Latest Articles