హాలీవుడ్ లోకి… ‘ఆర్ఆర్ఆర్’ హాట్ బ్యూటీ!

ఆలియా భట్ హాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోందా? అవునని ఆమే స్వయంగా ప్రకటించింది. ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక పోస్ట్ షేర్ చేసిన ఆమె హాలీవుడ్ టాలెంట్ మ్యానేజ్మెంట్ కంపెనీ ‘డబ్ల్యూఎమ్ఈ’ పేరు ప్రస్తావించింది. ‘ఎండీవర్’గా ప్రసిద్ధమైన సదరు టాలెంట్ మ్యానేజ్మెంట్ ఏజెన్సీ చాలా మంది టాప్ స్టార్స్ కోసం కూడా పని చేస్తుంటుంది. ఎమ్మా స్టోన్, గాల్ గాడోట్, ఓప్రా లాంటి వారు ఎండీవర్ ద్వారానే ఆఫర్స్ పొందుతుంటారు. నెక్ట్స్ ఆలియా కూడా అదే పనిలో ఉంది. అంతా అనుకున్నట్టు వర్కవుటైతే ఆమె త్వరలోనే హాలీవుడ్ లో కుడి కాలుమోపవచ్చు!
ఆలియా కంటే ముందే హాలీవుడ్ తలుపులు తట్టిన బాలీవుడ్ బ్యూటీస్ కొందరున్నారు. ఈ మధ్య కాలంలో దీపికా పదుకొణే, ప్రియాంక చోప్రా ప్రముఖంగా సందడి చేశారు. దీపికా ‘ట్రిపుల్ ఎక్స్’ మూవీలో విన్ డీజిల్ సరసన నటించింది. ఇక ప్రియాంక జోనాస్ అయితే హాలీవుడ్ లోనే సెటిలైపోయింది. దేసీ గాళ్ ప్రస్తుతం చాలా విదేసీ ప్రాజెక్ట్స్ లో తలమునకలై ఉంది. ‘మ్యాట్రిక్స్ 4’ లాంటి యాంటిసిపేటెడ్ మూవీస్ లో కనిపించబోతోంది. మరి ‘ఏబీ’ అలియాస్ ఆలియా భట్ కూడా డీపీ అండ్ పీసీ లాగా హాలీవుడ్ తెరపై హల్ చల్ చేస్తుందా? లెట్స్ వెయిట్ ఫర్ ‘గంగూభాయ్’!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-