`అల వైకుంఠ‌పుర‌ములో` వేవ్ కొన‌సాగుతోంది!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన అల వైకుంఠ‌పుర‌ములో సినిమా విడుద‌లై దాదాపు 16 మాసాలు గ‌డిచిపోయినా…. ఆ సినిమా ఇంపాక్ట్ ఇంకా సోష‌ల్ మీడియాలో స్ట్రాంగ్ గానే ఉంది. ఎస్.ఎస్.త‌మ‌న్ మ్యూజిక్ ఇచ్చిన అల వైకుంఠ‌పుర‌ములో యూట్యూబ్ లో బోలెడ‌న్ని అంశాలలో స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసింది. విశేషం ఏమంటే… ఆ మూవీకోసం కాస‌ర్ల శ్యామ్ రాసిన రాములో రాములా సాంగ్ ఇన్ స్టంట్ హిట్ అయిపోయింది. మూవీలోని ప్ర‌ధాన తారాగ‌ణం అంతా క‌లిసి స్టెప్పులేసిన ఆ పాటను కోట్లాది మంది యూ ట్యూబ్ లో వీక్షించ‌గా, తాజాగా రెండు మిలియ‌న్ల మంది దాన్ని లైక్ చేశారు. ఈ విష‌యాన్ని ఎస్.ఎస్. త‌మ‌న్ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా బ‌న్నీ అభిమానుల‌కు తెలియ‌చేశాడు. విశేషం ఏమంటే… అలా గ‌త యేడాది సంక్రాంతికి మొద‌లైన త‌మ‌న్ సంగీత జైత్ర‌యాత్ర అప్ర‌తిహ‌తంగా కొన‌సాగుతోంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-