‘టాయిలెట్’ మూవీ టాలెంటెడ్ బ్యూటీతో… మళ్లీ అక్షయ్

మహారాష్ట్ర ప్రభుత్వం కాస్త వెసులుబాటు ఇవ్వటంతో బాలీవుడ్ చకచకా సెట్స్ మీదకి బయలుదేరుతోంది. ఇప్పటికే ఒకట్రెండు పెద్ద సినిమాలు, కొన్ని చిన్న సినిమాలు కెమెరా ముందుకు వెళ్లాయి. ఇప్పుడు అక్షయ్ కుమార్ స్టారర్ ‘రక్షాబంధన్’ కూడా షూటింగ్ మొదలు పెట్టేసింది. ఆనందర్ ఎల్. రాయ్ దర్శకత్వంలో అన్నాచెల్లెళ్ల అనుబంధంపై ఈ సినిమా రూపొందిస్తున్నారు. అయితే, తాజాగా భూమి పెడ్నేకర్ కూడా ‘రక్షాబంధన్’ టీమ్ లో జాయిన్ అయింది. ఆమె పాత్ర గురించి ఇంకా పెద్దగా డిటైల్స్ తెలియకున్నా కథలో కీలక పాత్ర అంటున్నారు. అక్షయ్, భూమి గతంలో ‘టాయిలెట్ : ఏక్ ప్రేమ్ కథ’ సినిమాలో జంటగా నటించారు. ‘రక్షాంబంధన్’ అప్ డేట్ అభిమానులకి తెలియజేస్తూ అక్షయ్ కుమార్ ఓ ఫోటో షేర్ చేశాడు.

అందులో ఆనంద్ ఎల్. రాయ్, అక్షయ్ కుమార్, భూమి పెడ్నేకర్ చాలా ఖుషీగా నవ్వేస్తున్నారు. ఆ హ్యాపీ పిక్ ఫ్యాన్స్ తో పంచుకున్న అక్కీ ‘భూమి పెడ్నేకర్ ని ‘రక్షాబంధన్’ టీమ్ లోకి ఆహ్వానిస్తున్నాం!’ అని ప్రకటించాడు. అదే ఫోటోని తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసిన భూమి కూడా ‘అనందర్ ఎల్. రాయ్, అక్షయ్ లాంటి క్రియేటివ్ పవర్ హౌజెస్ తో పని చేయటం అదృష్టంగా భావిస్తున్నాను!’ అని కామెంట్ చేసింది. అక్షయ్ అప్ కమింగ్ మూవీస్ చాలానే ఉన్నాయి… ‘రక్షాబంధన్’తో పాటూ ‘పృథ్వీరాజ్, అత్రంగీ రే, బచ్చన్ పాండే, బెల్ బాటమ్, ఓ మై గాడ్ 2’ వంటి సినిమాల్లో ఖిలాడీ కుమార్ కనిపించనున్నాడు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-