అక్షయ్ కుమార్ కు మాతృవియోగం

బాలీవుడ్ అగ్ర నటుడు అక్షయ్ కుమార్ తల్లి నేడు తుది శ్వాస విడిచారు. తల్లి అనారోగ్యం బారిన పడిందని తెలియడంతో సెప్టెంబర్ 6న లండన్ నుంచి ఇండియా చేరుకున్నారు అక్షయ్ కుమార్. ఆయన తన నెక్స్ట్ మూవీ షూటింగ్ నిమిత్తం లండన్ వెళ్లారు. అక్షయ్ తల్లి శ్రీమతి అరుణ భాటియా వృద్ధాప్యం కారణంగా అనారోగ్యం బారిన పడ్డారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా వైద్యులు ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ఇక అక్షయ్ తన తల్లి చివరి సమయంలో ఆమెకు తోడుగా ఉండాలని షూటింగ్ ను సైతం మధ్యలోనే వదిలేసి వచ్చారు. గత రెండ్రోజుల నుంచి ఆసుపత్రిలో తల్లి దగ్గరే ఉన్న ఆయన ఆమె కోసం తన అభిమానులు, శ్రేయోభిలాషులు అంతా ప్రార్థించాలని కోరారు. ఆ ప్రార్థనలు తనకు, తన తల్లి ఆరోగ్యానికి బలం చేకూరుస్తాయని సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేశారు.

Read Also : డ్రగ్స్ కేసులో నేడు విచారణకు హీరో రానా

కాగా నేడు అరుణ భాటియా మరణం గురించి అక్షయ్ సోషల్ మీడియాలో స్వయంగా ప్రకటించారు. తన తల్లిని హఠాత్తుగా కోల్పోవడంతో ఈ నటుడు తీవ్ర షాక్‌కు గురయ్యాడు. ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ అక్షయ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. “ఆమె నా కోర్. ఈ రోజు నేను భరించలేని నొప్పిని అనుభవిస్తున్నాను. మా అమ్మ శ్రీమతి అరుణ భాటియా ఈ ఉదయం ప్రశాంతంగా ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి, ఇతర ప్రపంచంలో నాన్నతో కలిసిపోయారు. నేను, నా కుటుంబం మీ ప్రార్థనలను గౌరవిస్తాము. ఓం శాంతి” అని అక్షయ్ కుమార్ పోస్ట్ చేసారు. కాగా అక్షయ్ ప్రస్తుతానికి సినిమాల నుండి విరామం తీసుకుంటాడని భావిస్తున్నారు.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-