అక్షయ్ కుమార్ కి మళ్లీ ఝలక్ ఇచ్చిన కరోనా! సినిమా వాయిదా…

కరోనా మహమ్మరి సినీ నిర్మాతలు, దర్శకులు, అగ్ర హీరోలకి సస్పెన్స్ థ్రిల్లర్ చూపిస్తోంది! రెండేళ్లుగా అమాంతం విజృంభించి లాక్ డౌన్ లు నెత్తిన పడేస్తోంది. థియేటర్స్ లేక దేశంలోని అన్ని సినిమా రంగాలు అల్లాడిపోతున్నాయి. ఇక బాలీవుడ్ సంగతి సరే సరి. హిందీ సినిమాకు గుండెకాయ లాంటి ముంబై అత్యధిక కరోనా కేసులతో వణికిపోయింది. అయితే, ఇప్పుడు సెకండ్ వేవ్ కూడా సద్దుమణిగింది. కేసులు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. అయినా బీ-టౌన్ బిగ్ మూవీస్ రిలీజ్ కు లైన్ క్లియర్ కావటం లేదు. కరోనా వైరస్ తన కొత్త వేరియంట్ తో హారర్ సినిమాలో కనిపించని దెయ్యంలా ఫిల్మ్ మేకర్స్ ను హడల్ గొట్టేస్తోంది!

పోయిన సంవత్సరం కఠినమైన లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలోనే అక్షయ్ కుమార్ ‘బెల్ బాటమ్’ షూట్ పూర్తి చేశాడు. ఆయన అంత రిస్క్ చేసినా మూవీ ఇంత వరకూ రిలీజ్ కాలేదు. జూలై 27న అంటూ ఆ మధ్య అక్కీ అఫీషియల్ గా ప్రకటించాడు. కానీ, ఇప్పుడు ‘బెల్ బాటమ్’ టీమ్ మనసు మార్చుకుందట. మహారాష్ట్రలో, ఢిల్లీలో ఇంకా థియేటర్లు తెరుచుకోలేదు. ఈ నెల 15 నుంచీ ఓపెన్ చేస్తారేమోనని భావిస్తున్నారు. అది కూడా డౌట్ అని కొందరంటున్నారు. కొత్తగా వ్యాప్తి చెందుతోన్న డెల్టా ప్లస్ వేరియంట్ ప్రభుత్వాలకు సవాలుగా మారింది. థియేటర్స్ తెరిస్తే మరోమారు కేసులు అమాంతం పెరుగుతాయేమోనని ఆందోళన కొనసాగుతోంది.

Read Also : దూసుకెళ్తున్న “గానా ఆఫ్ రిపబ్లిక్”

జూలై 15 నుంచీ బాక్సాఫీస్ తెరుచుకున్నా, తెరుచుకోకపోయినా ‘బెల్ బాటమ్’ ప్రమోషన్స్ కష్టమేనని అక్షయ్ కుమార్, ఆయన దర్శకనిర్మాతలు భావించారట.అందుకే, ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా 13వ తేదీన పెద్ద తెర మీదకు వద్దామనుకుంటున్నారని టాక్. అది వీలుకాక పోతే ఆగస్ట్ 20న రక్షాబంధన్ పండుగ మూడ్ లో జనం ఉన్నప్పుడు రావాలనుకుంటున్నారని కూడా చెబుతున్నారు. దీనిపై ఇంకా అక్షయ్ కుమార్ కానీ, మరెవరు కానీ కామెంట్ చేయలేదు. బట్ ‘బెల్ బాటమ్’ పోస్ట్ పోన్ కావటం మాత్రం పక్కానే! చూడాలి మరి, అక్షయ్ కుమార్, వాణీ కపూర్, హ్యూమా ఖురేషి, లారా దత్తా, ఆదిల్ హుస్సేన్ స్టారర్ సస్పెన్స్ థ్రిల్లర్ పై సస్పెన్స్ ఎప్పుడు వీడుతుందో…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-