అక్షయ్ కుమార్ ‘రామ్ సేతు’ ఊటీ షెడ్యూల్ పూర్తి!

అక్షయ్ కుమార్, జాక్విలిన్ ఫెర్నాండేజ్ కీలక పాత్రలు పోషిస్తున్న సినిమా ‘రామ్ సేతు’. అభిషేక్ శర్మ దర్శకత్వంలో ఈ సినిమాను అరుణ్ భాటియా, విక్రమ్ మల్హోత్ర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విశేషం ఏమంటే… అమెజాన్ ప్రైమ్ వీడియో తొలిసారి ఈ భారతీయ చిత్రానికి కో-ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తోంది. వచ్చే యేడాది అక్టోబర్ 24న దీపావళి కానుకగా ‘రామ్ సేతు’ విడుదల కానుంది. గత యేడాది నవంబర్ 14న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. రెగ్యులర్ షూటింగ్ ను ఈ యేడాది మార్చి 30న మొదలు పెట్టారు. కానీ ఐదారు రోజులకే హీరో అక్షయ్ కుమార్ కు కొవిడ్ 19 పరీక్షలో పాజిటివ్ రిపోర్ట్ రావడంతో షూటింగ్ ను నిలిపి వేశారు.

Read Also : వారం రోజుల్లో ‘ఎలిజిబుల్ బ్యాచిలర్’కు 40 కోట్లు!

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఊటీ షెడ్యూల్ లో అక్షయ్ కుమార్, జాక్విలిన్ తో పాటు తెలుగు నటుడు సత్యదేవ్ సైతం పాల్గొన్నాడు. ఈ ఫోటోను అక్షయ్ కుమార్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ‘రామ్ సేతు’ ఊటీ షెడ్యూల్ పూర్తయినట్టు తెలిపారు. ఇందులో రామ్ గా అక్షయ్, లక్ష్మణ్ గా సత్యదేవ్, సీతగా జాక్విలిన్, ఊర్మిళగా నుస్రత్ బరూచా నటిస్తున్నారు. ఊటీలోని పర్వతసానువుల్లో సత్యదేవ్, జాక్విలిన్ తో తానున్న ఫోటోను అక్షయ్ ట్వీట్ చేస్తూ, ‘ఫోటోలో లేదా జీవితంలో చీకటి మేఘాల పైన ఎల్లప్పుడూ అందమైన కాంతిరేఖ ఉంటుంది’ అని పేర్కొన్నాడు.

Related Articles

Latest Articles