“ఆకాశం నీ హద్దురా” హిందీ రీమేక్… హృతిక్ స్థానంలో మరో హీరో ?

అమెజాన్ ప్రైమ్‌లో విమర్శకుల ప్రశంసలు అందుకున్న మూవీ “సూరారై పొట్రు”. సూర్య హీరోగా, సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని హిందీలో రీమేక్ చేయనున్నారు. అయితే ఈ హిట్ రీమేక్ లో అక్కడ హీరోగా ఎవరు నటిస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఆ జాబితాలో పలువురు స్టార్ హీరోల పేర్లు విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్నటి వరకూ హిందీ రీమేక్ లో హృతిక్ రోషన్ నటించబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఆ స్థానంలో మరో హీరో పేరు విన్పిస్తోంది. బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ “సూరారై పొట్రు”లో హీరోగా కన్పించబోతున్నాడట. గతంలో అక్షయ్ కుమార్ “రౌడీ రాథోడ్, భూల్ భూలైయా, లక్ష్మి బాంబ్” వంటి హిందీ రీమేక్ లలో నటించాడు. ఇప్పుడు ఆయన “సూరారై పొట్రు” రీమేక్ లో సూర్య పాత్రలో నటించడానికి సిద్దమయ్యారు. ఈ చిత్రాన్ని సూర్య 2డి ఎంటర్టైన్మెంట్, విక్రమ్ మల్హోత్రా అబుండాంటియా ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Read Also : “ఆర్ఆర్ఆర్”లో రామ్ చరణ్ సర్పైజ్ లుక్

ఇక “సూరారై పొట్రు” విషయానికొస్తే అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళంలో విడుదలైంది. కన్నడ, మలయాళంలో అదే టైటిల్ తో, తెలుగులో “ఆకాశం నీ హద్దురా” పేరుతో రిలీజ్ అయ్యింది. సుధా కొంగర డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఇటీవల “షాంఘై అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 2021″కు ఎంపికైంది. ఈ చిత్రంలో అపర్ణ బాలమురళి, పరేష్ రావల్, మోహన్ బాబు, కృష్ణకుమార్, వివేక్ ప్రసన్న, కరుణలు ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ మూవీ ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జిఆర్ గోపీనాథ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కింది. థియేటర్లో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఓటిటి ప్లాట్‌ఫాంపై విడుదల చేయబడింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-