సొషల్ మీడియాలో కామెడీగా మారిన అక్షయ్ ‘ఏడుపు’ డ్యాన్స్!

క్షణం ఖాళీగా కూర్చోకుండా యమ బిజీగా ఉండే బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్. సినిమాలు, యాడ్స్, ప్రమోషన్స్, సోషల్ సర్వీస్ క్యాంపైన్స్… ఇలా చాలా చేస్తుంటాడు. మరో వైపు, వెబ్ సిరీస్ కూడా చేస్తానని ఆ మధ్య ప్రకటించాడు. అయితే, అది ఇంత వరకూ సెట్స్ మీదకైతే వెళ్లలేదు. కానీ, కృతీ సనన్ చెల్లెలు నూపుర్ సనన్ తో గతంలో ఓ వీడియో సాంగ్ చేశాడు అక్కీ! ఇప్పుడు రెండో పాట విడుదలైంది…

అక్షయ్, నూపుర్ సనన్ జంటగా ప్రస్తుతం యూట్యూబ్ లో అలరిస్తోంది ‘ఫిల్హాల్ 2 మొహబ్బత్’ పాట. ఈ వీడియో ఆల్బమ్ సాంగ్ లో కాస్త విషాదాన్ని జోడించారు మేకర్స్. నిజమైన ప్రేమకి మరణం లేదంటూ సాగే గీతంలో లవ్వర్స్ విడిపోతే కలిగే బాధని, దుఃఖాన్ని చూపారు. నెటిజన్స్ నుంచీ మంచి రెస్పాన్సే వస్తోంది. అయితే, సొషల్ మీడియాలో మీమ్స్ వీరులు మాత్రం సైలెంట్ గా ఉండటం లేదు.

‘ఫిల్హాల్ 2’ సాంగ్ లో అక్షయ్ ఓ చోట డ్యాన్స్ ఆడుతూ ఉంటాడు. కానీ, ఆనందంగా స్టెప్పులేస్తోన్న అక్కీ ఉన్నట్టుండీ ఏడ్చేస్తాడు! ఇప్పుడు ఇదే సీన్ మీమ్స్ కి సబ్జెక్ట్ గా మారింది. ఒక్కొక్కరూ ఒక్కోలా మీమ్స్ చేసి వదులుతున్నారు. “‘పెళ్లిలో డ్యాన్స్ చేస్తున్నప్పుడు హఠాత్తుగా మనకు ఇంకా పెళ్లి కాలేదనీ, 30 ప్లస్ ఏజ్ వచ్చేసిందని గుర్తుకు వచ్చినప్పుడు…” అంటూ ఒకరు మీమ్ క్రియేట్ చేశారు! “ఒక వికెట్ పడిందని సంతోష పడుతున్నంతలోనే… మన టీమ్ ఐపీఎల్ 14 సీజన్స్ లో ఒక్కటి కూడా గెలవలేదని జ్ఞానోదయం అయినప్పుడు…” అన్నారు మరికొందరు మీమ్స్ పోస్టు చేసిన వారు.

‘ఫిల్హాల్ 2’ సాంగ్ పై మీమ్స్ వెల్లువెత్తటంతో అక్షయ్ కూడా స్వయంగా వాటి గురించి ట్వీట్ చేశాడు. తమ వీడియో సాంగ్ కాస్త సాడ్ ఫీలింగ్ తో సాగినా మీమ్స్ కారణంగా మంచి ఫన్ జనరేట్ అయిందంటూ సంతోషం వ్యక్తం చేశాడు.

సొషల్ మీడియాలో కామెడీగా మారిన అక్షయ్ ‘ఏడుపు’ డ్యాన్స్!
-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-