దుల్కర్ సల్మాన్ తో అక్కినేని హీరో మల్టీస్టారర్

మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్, హను రాఘవపూడి కాంబినేషన్ లో ఓ భారీ పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ రూపొందనున్నట్టు కొంతకాలం క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి “లెఫ్టినెంట్ రామ్” అనే టైటిల్ ను కూడా ఇప్పటికే ప్రకటించి సినిమాపై ఆసక్తిని పెంచేశారు. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం దుల్కర్ సల్మాన్ నిర్మాతలు ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం అక్కినేని సుమంత్ ను సంప్రదించారట.

Read Also : అప్పుడే పవర్ ఫుల్ బర్త్ డే సెలెబ్రేషన్స్ స్టార్ట్ !

హను రాఘవపుడి వివరించిన కథకు, అందులో తన పాత్రకు సుమంత్ బాగా ఇంప్రెస్ అయ్యారట. దీంతో ఆయన వెంటనే ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ చిత్రంలో సుమంత్ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఈ యంగ్ హీరో సినిమా సినిమాకు మధ్య చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు. ఇటీవల “కపటధారి” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం ఆయన “అనగనగా ఒక రౌడీ” చిత్రంతో బిజీగా ఉన్నాడు. కాగా “లెఫ్టినెంట్ రామ్” బహుభాషా చిత్రం. ఇందులో సౌత్ దిగ్గజ నటీనటులు కనిపించబోతున్నారు. లీడ్ కాస్ట్, సిబ్బంది గురించి మరిన్ని వివరాలను ప్రాజెక్ట్ ను ప్రారంభించిన తర్వాత మేకర్స్ ప్రకటించనున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-