ఆ స్పష్టత రానిదే.. ‘లవ్ స్టోరీ’పై అప్డేట్ రాదట!

అక్కినేని హీరో నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఏప్రిల్ 16న విడుదలకావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటన చేసింది. అయితే ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో వాయిదా పడిన సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో లవ్ స్టోరీ కూడా ఆగస్టు 7వ తేదీన రిలీజ్ కాబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా చిత్రబృందం దీనిపై స్పందించినట్లు తెలుస్తోంది. లవ్ స్టోరీ సినిమాపై చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే దాకా ఎలాంటి న్యూస్ నమ్మవద్దు అంటూ క్లారిటీ ఇచ్చినట్లు వినిపిస్తోంది. రెండు రాష్ట్రాల్లో థియేటర్ల విషయమై పూర్తి స్పష్టత వచ్చేదాకా లవ్ స్టోరీ చిత్రంపై అప్డేట్ ఇవ్వలేమంటూ తెలిపినట్టు సమాచారం. కాగా ఈ సినిమా పాటలు, టీజర్ వంటి వాటితో కావాల్సినంత పాపులారిటీ రావడంతో అంచనాలు ఏర్పడ్డాయి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-