ఓటిటీ బాట పట్టనున్న అక్కినేని హీరో కొత్త సినిమా..?

అక్కినేని సుమంత్, నైనా గంగూలీ జంటగా నటించిన చిత్రం ‘మళ్లీ మొదలైంది’. రెడ్ సినిమాస్ బ్యానర్ పై రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీర్తి కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇకపోతే ఈ సినిమా ఈపాటికి విడుదల కావాల్సి ఉండగా కరోనా వలన వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక అందుతున్న సమాచారం బట్టి ఈ సినిమా ఓటిటీ బాట పట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటిటీ సంస్థ జీ గ్రూప్ భారీ మొత్తంలో ఈ సినిమాను కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరో నెల రోజుల్లో జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్. పెళ్ళైన జంట కొన్ని విభేదాల వలన విడాకులు తీసుకుంటారు. విడాకుల తరువాత ఆ వ్యక్తి ఎదుర్కొన్న పరిస్థితులను వినోదాత్మకంగా చూపించినట్లు డైరెక్టర్ తెలిపారు. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే మేకర్స్ అధికారికంగా ప్రకటించాలి.

Related Articles

Latest Articles