హంగేరీకి ‘ఏజెంట్’… షూటింగ్ ఎప్పుడంటే ?

అక్కినేని అఖిల్ ‘ఏజెంట్’గా హంగేరీకి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో హై బడ్జెట్ స్పై థ్రిల్లర్ గా రూపొందుతున్న ‘ఏజెంట్’ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా కోసం సరికొత్త బాడీ ట్రాన్స్ఫర్మేషన్ లోకి మారిన అఖిల్ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. ఇక ఇప్పటికే “ఏజెంట్” బృందం నెల్లూరులోని కృష్ణపట్నం పోర్టు, వైజాగ్ పోర్టు, హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సిలలో వంటి ప్రాంతాల్లో కొన్ని కీలక షెడ్యూల్‌లను పూర్తి చేసింది. ప్రధాన యూనిట్ యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్ కోసం హంగేరి రాజధాని బుడాపెస్ట్‌కు వెళ్లడానికి సిద్ధంగా ఉంది. తాజా అప్‌డేట్‌ల ప్రకారం ‘ఏజెంట్’ బుడాపెస్ట్ షెడ్యూల్ అక్టోబర్ 20 నుండి ప్రారంభమవుతుంది. ‘ఏజెంట్‌’లో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తుండగా, ప్రముఖ రచయిత, దర్శకుడు వక్కంతం వంశీ స్క్రిప్ట్ రాశారు.

Read Also : బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన రకుల్… బర్త్ డే సర్ప్రైజ్ షాక్!!

మరోవైపు అఖిల్ నటించిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” విడుదలకు సిద్ధంగా ఉంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ అక్టోబర్ 15న విడుదల కానుంది. ఈ సినిమాపై అఖిల్ తో సహా దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. సినిమా తప్పకుండా హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందేమో చూడాలి.

-Advertisement-హంగేరీకి 'ఏజెంట్'… షూటింగ్ ఎప్పుడంటే ?

Related Articles

Latest Articles