సినిమా తీసేదే థియేటర్ కోసం : అఖిల్

అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా రొమాంటిక్ ఎంటర్టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”. ఈ సినిమా అక్టోబర్ 15న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో నేడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది. ఇందులో హీరో అఖిల్ మాట్లాడుతూ… ఒక్క మంచి సినిమా తీసాం అని అనుకుంటున్నాను. డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ ఒక్కే షాట్ ను ఎలా తీయాలి.. అంతకంటే బాగా ఎలా తీయాలి అని ఆలోచిస్తుంటారు అని చెప్పిన అఖిల్ ఈ సినిమాలో ఆమని గారు అలాగే మిగితా వారు అందరితో నటించడం సంతోషంగా ఉంది. ఇక మా సినిమా హీరోయిన్ పూజా హెగ్డే చాలా కష్టపడుతుంది. ఈ సినిమాలో కూడా ఆమె చాలా కష్ట పది చేసింది అన్నారు. ఇక ఈ కరోనా లాక్ డౌన్ కారణంగా సమస్యలు ఎదుర్కుంటున్న సమయంలో అది పోయి సినిమాలు విడుదల అయ్యాయి. కానీ మళ్ళీ మరో లాక్ డౌన్ వచ్చి ఇబ్బంది పెట్టింది. కానీ ఇప్పుడు మళ్ళీ థియేటర్లు తెరుచుకున్నాయి. తాజాగా విడుదల అయిన లవ్ స్టోరీ సినిమా ఇచ్చిన నమ్మకం కారణంగానే మేము ఈ విడుదలకు సిద్ధం అయాం అని అన్నారు. ఇక సినిమా తీసేది థియేటర్ కోసం అని చెప్పిన అఖిల్ ఈ అక్టోబర్ 15న థియేటర్ లోనే కలుద్దాం అని చెప్పాడు.

-Advertisement-సినిమా తీసేదే థియేటర్ కోసం : అఖిల్

Related Articles

Latest Articles