అక్కినేని వారు కూడా అదే బాట!

కరోనా లాక్ డౌన్ నుంచి అన్ని రంగాలకు విముక్తి లభించిన.. సినిమా థియేటర్లు మాత్రం కాస్త ఓపికపడుతున్నాయి. బడా సినిమాల విడుదల కోసం థియేటర్ల యాజమాన్యాలు వేచిచూస్తున్నాయి. దీంతో ఓటీటీ సంస్థలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీ వేదికలపై విడుదలై మంచి సక్సెస్ సాధించడంతో మరిన్ని సినిమాలు అదే దారిలో ప్రయాణిస్తున్నాయి. ఇప్పటికే విక్టరీ వెంకటేష్ సినిమాలు నారప్ప, దృశ్యం2 సినిమాలు ఓటీటీలో విడుదల కాబోతున్నాయనే ప్రచారం జరుగుతుండగా.. అనూహ్యంగా అక్కినేని అఖిల్ నటిస్తున్న ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ సినిమా కూడా ఓటీటీ మాధ్యమంలోనే ప్రయాణించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అటువైపు నుంచి పలు ఆఫర్లు రాగా.. థియేటర్‌లోనే విడుదల కోసం ఇన్నాళ్లు వేచి చూశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీ బాటనే సరైన నిర్ణయంగా భావిస్తున్నారని సమాచారం. మరికొద్ది రోజుల్లోనే దీనిపై స్పష్టత రానుంది.

-Advertisement-అక్కినేని వారు కూడా అదే బాట!

Related Articles

Latest Articles