బ్యాచ్‌లర్‌ పార్టీలో అక్కినేని హీరో

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌’ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. అక్కినేని అఖిల్, పూజా హెగ్డ్ జంటగా నటించిన ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాపై చిత్రబృందం చాలా నమ్మకంగా వుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ చిత్రబృందం సమావేశం అయింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు ర్యాప్ అప్ పార్టీ ఏర్పాటు చేశారు. చిత్రబృందంతో హీరో అఖిల్, దర్శకుడు భాస్కర్ సందడి చేసిన ఈ వీడియో ప్రోమో త్వరలోనే విడుదల చేయనున్నారు.

ఇక ఈ చిత్ర కథ విషయానికి వస్తే.. పెళ్లి చేసుకోవడానికి ఇండియా వచ్చిన ఓ ఎన్‌ఆర్‌ఐ కుర్రాడు, స్టాండప్‌ కమెడియన్‌ అయిన ఓ అమ్మాయి కోసం ఏం చేశాడు? అనే అంశం ఆధారంగా ఈ చిత్ర కథనం సాగుతుంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ రూపొందిస్తున్న ఈ మూవీని బన్నీ వాసు, మరో నిర్మాత, దర్శకుడ వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

-Advertisement-బ్యాచ్‌లర్‌ పార్టీలో అక్కినేని హీరో

Related Articles

Latest Articles