ఆ కండల వెనుక యేడాది కష్టం!

సినిమా రంగంలో వారసులదే హవా అని చాలామంది భావిస్తారు. కానీ ఆ వారసులు సైతం ప్రతిభ లేకపోతే సిల్వర్ స్క్రీన్ మీద నిలబడలేరు. తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడానికి, విజయతీరాలను చేరుకోవడానికి నిరంతరం వీళ్ళూ శ్రమించాల్సిందే. స్టార్స్ కొడుకులుగా వీళ్ళకు ఎంట్రీ సులువుగా ఉంటుందేమో కానీ తమని తాము ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు కొత్తవాళ్ళకంటే ఎక్కువ కష్టపడాలి. ఎందుకంటే నట వారసులపై అభిమానులకు, ప్రేక్షకులకు విపరీతమైన అంచనాలు ఉంటాయి. అవి వరం గానే కాకుండా ఒకోసారి శాపంగానూ పరిణమిస్తాయి. ‘అఖిల్’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్ వరుసగా మూడు పరాజయాలతో సతమతమవుతున్నాడు.

Read Also : తెలుగు, కన్నడ కుర్రాళ్ల కోసం మళ్లీ… సన్నీ ‘డియ్యో డియ్యో’!

త్వరలో రాబోతున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో పాటు ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘ఏజెంట్’పై అఖిల్ బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లో యంగ్ లవర్ బోయ్ గా నటించాడు కాబట్టి ఓకే.. కానీ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ‘ఏజెంట్’లో అఖిల్ ది గూఢచారి పాత్ర. దానికి తగ్గట్టుగా బాడీని బిల్డప్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ చిత్ర బృందం విడుదల చేసిన అఖిల్ పోస్టర్ చూసి అంతా ‘వావ్’ అంటూ కామెంట్ చేస్తున్నారు కానీ ఆ కండల దేహాన్ని మలచడం వెనుక యేడాది శ్రమ ఉందని అఖిల్ చెబుతున్నాడు. ‘365 రోజుల క్రితం శారీరకంగానూ, మాసికంగానూ నేను మారాలంటూ సురేందర్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. ఆయన నాలో రగిల్చిన అగ్ని తాలుకు ప్రభావం ఈ సినిమా అంతా కనిపిస్తుంది. నేను ఈ విషయంలో ప్రామిస్ చేస్తున్నాను’ అంటూ సురేందర్ రెడ్డిని ఉద్దేశించి అఖిల్ తెలిపాడు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నిర్మితమవుతున్న ‘ఏజెంట్’ చిత్రానికి సురేందర్ రెడ్డి కూడా నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-