అఖిల్ కి ఈ క్రిస్టమస్ అయినా కలసి వస్తుందా!?

అక్కినేని అఖిల్ ‘ఏజెంట్’గా ఈ డిసెంబర్ లో రాబోతున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం అఖిల్ పూర్తి స్థాయిలో మేకోవర్ అయ్యాడు. రా ఏజెంట్ గా పాత్రలో పరకాయ ప్రవేశం చేయటానికి తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు. ‘ఏజెంట్’ గా అతని లుక్ అందరినీ ఆకట్టకుంది. ఇప్పటి వరకూ అఖిల్ నటించిన సినిమాల్లో ఇదే బెస్ట్ లుక్ అనిపించుకుంది. ఈ సినిమాను క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 24న విడుదల చేయటానికి యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

Read Also: రివ్యూ: రాజ రాజ చోర

నిజానికి క్రిస్టమస్ సీజన్ నాగ్ కి అచ్చివచ్చిందని చెబుతుంటారు. ‘మన్మథుడు, మాస్’ సినిమాలు ఈ సీజన్ లోనే విడుదలై చక్కటి విజయాన్ని సాధించాయి. అయితే ఆ తర్వాత వచ్చిన ‘డాన్, కింగ్, రగడ, రాజన్న, ఢమరుకం’ మాత్రం నాగార్జునకు నిరాశనే మిగిల్చాయి. ఇక అఖిల్ సైతం ఓ సారి ఇదే సీజన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ నటించిన ‘హలో’ సినిమా క్రిస్టమస్ కే విడుదలై పరాజయం పాలయింది. ఇప్పుడు మరోసారి ఈ సీజన్ ను నమ్ముకుని ముందడుగు వేస్తున్నాడు అఖిల్. ‘ఏజెంట్’ హై బడ్జెట్ స్పై డ్రామా. వక్కంతం వంశీ రాసిన కథకు సురేందర్ రెడ్డి ట్రీట్ మెంట్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. గతంలో వక్కంతం, సురేందర్ రెడ్డి కలయికలో వచ్చిన ‘కిక్, రేసు గుర్రం’ బ్లాక్ బస్లర్ హిట్స్ గా నిలిచాయి. దాంతో ఈ కాంబినేషన్ మూవీపై ఆసక్తి ఏర్పడింది. ఈ సినిమాను ఎకెఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మిస్తోంది. అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు ముందు అఖిల్ నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ విడుదల కావలసి ఉంది. మరి ఈ రెండు సినిమాలతోనైనా నాగార్జున చిన్నబ్బాయి ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.

అఖిల్ కి ఈ క్రిస్టమస్ అయినా కలసి వస్తుందా!?
-Advertisement-అఖిల్ కి ఈ క్రిస్టమస్ అయినా కలసి వస్తుందా!?

Related Articles

Latest Articles