ఓటిటిలో కూడా పోటీనా? నాని వర్సెస్ బాలయ్య!

ఓటిటిలో కూడా పోటీనా ? తాజాగా విడుదలైన రెండు భారీ చిత్రాలు ఒకేరోజున ఓటిటి ప్రీమియర్ కు రెడీ అవుతున్నాయి. నాని వర్సెస్ బాలయ్య అనిపించేలా వీరిద్దరూ నటించిన రెండు తాజా చిత్రాలూ వేరు వేరు ఓటిటి ప్లాట్ఫామ్ లో ఒకేరోజు విడుదల అవుతుండడం గమనార్హం.

Read Also : పరువానికి మించిన బరువులు మోస్తున్న సామ్… వీడియో వైరల్

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన “శ్యామ్ సింగ రాయ్” డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఒక మోస్తరుగా ఆడిందనే చెప్పాలి. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఇప్పటి నుండి రెండు వారాల్లో దాని డిజిటల్ స్ట్రీమింగ్ భాగస్వామి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులోకి వస్తుంది. తాజా సమాచారం ప్రకారం “శ్యామ్ సింగ రాయ్” జనవరి 21 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులోకి రానున్నారు. నాని నటించిన ఈ చిత్రానికి సంబంధించిన మేకర్స్ కానీ, నెట్‌ఫ్లిక్స్ కానీ ఈ విషయమై అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ప్రస్తుతం జోరుగా దీనికి సంబంధించిన ప్రచారం జరుగుతోంది.

ఇక మరోవైపు నటసింహం నందమూరి బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’ కూడా అదే రోజున ఓటిటి విడుదలకు సిద్ధంగా ఉంది. జనవరి 21న ‘అఖండ’ చిత్రం డిస్నీలో ప్రసారం కానుంది. మరి ఈ రెండు చిత్రాల్లో ప్రేక్షకులు ఏ సినిమా చూడడానికి మొగ్గు చూపుతారో చూడాలి.

Related Articles

Latest Articles