చివరి షెడ్యూల్ లో ‘అఖండ’

నటసింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్నమూడో చిత్రం ‘అఖండ’ మీద భారీ స్థాయిలో క్రేజ్ నెలకొంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ మీద మిర్యాల రవీందర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా దీనిని నిర్మిస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణను ‘అఖండ’ గా పరిచయం చేస్తూ వదిలిన టీజర్ కు సోషల్ మీడియాలో ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఆ టీజర్ లో బాలకృష్ణ నట విశ్వరూపానికి యూట్యూబ్‌లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి.

read also : ముద్దులు అయిపోయాయి! జిమ్ములో పద్దులు లెక్కెడుతోన్న సీరియల్ కిస్సర్!

50 మిలియన్ల వ్యూస్‌ను క్రాస్ చేసి ఇంకా సోషల్ మీడియలో దూసుకెళ్తోంది టీజర్. జూలై 12న హైద్రాబాద్‌లో ‘అఖండ’ చివరి షెడ్యూల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మూవీ షూటింగ్ నుంచి ‘అఖండ’ గెటప్ లో ఉన్న బాలకృష్ణకు దర్శకుడు బోయపాటి శ్రీను సీన్ వివరిస్తున్న ఓ స్టిల్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ స్టిల్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-