“అఖండ” సెన్సార్ కార్యక్రమాలు పూర్తి

నందమూరి బాలకృష్ణ ‘సింహా’, ‘లెజెండ్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఇచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో చేస్తున్న హ్యాట్రిక్ చిత్రం “అఖండ”. ఈ చిత్రం పవర్ ప్యాక్డ్ ట్రైలర్ వారం క్రితం విడుదలై టాలీవుడ్ లో సంచలనం సృష్టించింది. ఈ చిత్రంలో బాలయ్య రెండు పవర్ ఫుల్ డిఫరెంట్ అవతార్లలో కనిపిస్తారు. “అఖండ”కు సంబంధించిన తాజా అప్‌డేట్ ఏమిటంటే ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్‌ను తాజాగా పూర్తి చేసుకుంది. సినిమాను వీక్షించిన సెన్సార్ బోర్డు సభ్యులు ‘అఖండ’కు యూ/ఏ సర్టిఫికేట్ ను జారీ చేశారు. సినిమా విడుదలకు ఇంకా వారం రోజులే ఉండడంతో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచుతున్నారు.

Read Also : కైకాల ఆరోగ్యంపై చిరంజీవి ట్వీట్

డిసెంబర్ 2న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లో ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తుండగా, జగపతిబాబు, పూర్ణ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హీరో శ్రీకాంత్ ప్రతినాయకుడి పాత్రలో మెప్పించనున్నాడు. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ ప్రాజెక్ట్‌ను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా, థమన్ సంగీతం అందించాడు.

Related Articles

Latest Articles