బ్యాక్ గ్రౌండ్ ఉన్నోడు ఫెయిలయితే మనిషిగా కూడా చూడరు: ఆకాష్ పూరీ

‘రొమాంటిక్’ ప్రి రిలీజ్ ఈవెంట్‌లో పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ చాలా భావోద్వేగంతో మాట్లాడాడు. తన తండ్రి పని అయిపోయింది అన్న వాళ్లకు తాను సమాధానం చెప్తానని ప్రకటన చేశాడు. పూరీ కొడుకుగా పుట్టడం తన అదృష్టమన్నాడు. తన తాత సింహాచలం నాయుడు పేరు ఎవరికీ తెలియదని.. కానీ తన తండ్రి పూరీ జగన్నాథ్ పేరు అందరికీ తెలుసని మాట్లాడాడు. తెలుగు ఇండస్ట్రీలో ఏ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా వచ్చిన వాడు ఫెయిల్ అయితే వాడిపై సింపతీ ఉంటుందని.. అదే బ్యాక్‌గ్రౌండ్ ఉన్నోడు ఫెయిల్ అయితే వాడిని బయట మనిషిగా కూడా చూడరని ఆకాష్ పూరీ అన్నాడు.

Read Also: విజయ్ దేవరకొండ మా ఫ్యామిలీ మెంబర్: మంత్రి ఎర్రబెల్లి

తన లైఫ్‌లో సక్సెస్ అయ్యి చూపిస్తానని.. సక్సెస్ అనేది తనకు డూ ఆర్ డై అని ఆకాష్ పూరీ పేర్కొన్నాడు. ప్రతి సినిమా కష్టపడి చేయమని తన తండ్రి చెప్పాడని.. ప్రతి సినిమాను ఫస్ట్ సినిమా అనుకుని నటించామన్నాడని.. కానీ ప్రతి సినిమా తన లాస్ట్ సినిమా అనుకుని కష్టపడి సక్సెస్ అవుతానని ఆకాష్ పూరీ తెలిపాడు. తాను దేనికీ పనికిరానని కొంతమంది చెప్పారని.. వాళ్లకు ఇప్పుడు చెప్తున్నానని.. నో ఇట్స్ నాట్ ఓవర్ అని, ఇప్పుడే మొదలైందని పేర్కొన్నాడు.

Related Articles

Latest Articles